“బిగ్ బాస్ 4” హౌస్ లో వరస్ట్ పెర్ఫామర్ గా అభిజీత్.!

Published on Dec 5, 2020 10:00 am IST


మన తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ షో నాలుగో సీజన్లో ఒకింత కాంట్రవర్సీ కన్నా ఎమోషనల్ పాళ్ళు ఎక్కువయ్యాయి అని చెప్పాలి. సరిగ్గా షో లాస్ట్ కు వస్తున్న సమయంలో అంతా వేరే విధంగా మారుతుంది. ఈ 13వ వారంలో పలు కీలక పరిణామాలే బిగ్ బాస్ హౌస్ లో చోటు చేసుకున్నాయి. మొదటగా ఫైనల్ టికెట్ విషయంలో షోయెల్ అలాగే అఖిల్ లు టాస్క్ లో అఖిల్ ఫైనల్స్ కి వెళ్లడం ఊహించని విధంగా జరిగింది.

ఆ తర్వాత అఖిల్ మినహా నంబర్స్ వారీగా ఎవరు ఏ నెంబర్ కు సూట్ అవుతారు అని వారినే డిసైడ్ చేసుకోమనగా ఆడియెన్స్ లో వన్ ఆఫ్ ది టాప్ అండ్ ఫైనెస్ట్ కంటెస్టెంట్ గా ఉన్నటువంటి అభిజీత్ అందరికన్నా చివరి స్థానంలో తనని తానే వరస్ట్ పెర్ఫామర్ గా ప్రొజెక్ట్ చేసుకున్నాడు. అంతే కాకుండా బిగ్ బాస్ హౌస్ లో వరస్ట్ పెర్ఫామర్ గా అభిజీత్ ఒప్పుకోవడంతోనే అతన్ని జైల్లోకి వెళ్ళమనగా అందుకు కూడా సిద్ధం అయ్యాడు.

సంబంధిత సమాచారం :

More