విశాల్ అభిమన్యుడు టిజర్ విడుదల తేది !

విశాల్, స‌మంత జంట‌గా న‌టిస్తున్న చిత్రం ‘అభిమ‌న్యుడు’. ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు ఈ చిత్రాన్ని విడుదల చెయ్యాలని యూనిట్ భావించినా అనివార్య కారణాల వల్ల విడుదల తేది వాయిదా పడింది. త్వరలో కొత్త డేట్ ప్రకటించబోతున్నారు దర్శక నిర్మాతలు. రేపు సాయంత్రం 5 గంటలకు అభిమన్యుడు టిజర్ విడుదల చెయ్యబోతున్నారు.

సీనియ‌ర్ తమిళ హీరో అర్జున్ ఈ సినిమాలో నెగిటివ్ పాత్రలో కనిపించబోతున్నాడు. మిత్ర‌న్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు యువ‌న్ శంక‌ర్ రాజా సంగీత‌ ద‌ర్శ‌కుడు. జి.హ‌రి ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రంలో విశాల్ లుక్స్ బయటికి రావడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి.