‘కంగనా రనౌత్’ చెప్పింది నీచమైన అబద్ధం – క్రిష్

Published on Jan 28, 2019 12:42 pm IST

బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో, పోరాట యోధురాలు ‘రాణి లక్ష్మి భాయ్’ జీవిత చరిత్ర ఆదారంగా తెరకెక్కిన ‘మణికర్ణిక’ చిత్రానికి మొదట దర్శకుడు క్రిష్ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. అయితే ఆ తరువాత ఆయనకు, కంగనా రనౌత్ కు మధ్య వచ్చిన అభిప్రాయభేదాలు కారణంగా క్రిష్ ఈ చిత్ర దర్శకత్వ బాధ్యతల నుండి తప్పుకున్నారు.

కాగా ఈ వివాదం గురించి తాజాగా క్రిష్ ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘సినిమాలో 70 శాతం సన్నివేశాలకు తానే దర్శకత్వం వహించానని కంగన చెప్పుకున్నారు. ఇది చాలా నీచమైన అబద్ధం. బహుశా ఆమె దర్శకత్వం వహించినట్లు కలగన్నారేమో. అందుకే ఆమె అలా చెప్పి ఉంటారు. ఆ సినిమాకి పనిచేసిన టీమ్ లో కొంతమంది ఇప్పటికీ నాతో టచ్‌ లోనే ఉన్నారు. వాళ్ళు ఏం చెప్పారంటే.. నేను దర్శకత్వం వహించిన సన్నివేశాల్లో కొన్ని సన్నివేశాలకూ క్లోజప్‌ షాట్స్ ఆమె అదనంగా తీసారట. అంత మాత్రానికే ఆమె 70 శాతం సన్నివేశాలకు దర్శకత్వం వహించినట్లా ? దీని గురించి నాకు, కంగనకు మధ్య చర్చలు జరగలేదు. కానీ నా గురించి కంగన చెప్పినవన్నీ అబద్ధాలే అని క్రిష్ చెప్పుకొచ్చారు.

సంబంధిత సమాచారం :