రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న ‘ఆచారి అమెరికా యాత్ర’ !
Published on Dec 4, 2017 5:16 pm IST

మంచు హీరో విష్ణు ప్రస్తుతం రెండు సినిమాల్లో నటిస్తున్నారు. వాటిలో ఒకటి ‘ఆచారి అమెరికా యాత్ర’. ఈ చిత్రాన్ని జి. నాగేశ్వర రెడ్డి తెరకెక్కిస్తున్నారు. ఈయన విష్ణుతో గతంలో ‘దేనికైనా రెడీ, ఈడో రకం ఆడో రకం’ వంటి హిట్ సినిమాల్ని తీశారు. అందుకే ఈ సినిమాపై కూడా మంచి అంచనాలున్నాయి.

ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరి 26న రిపబ్లిక్ డే నాడు రిలీజ్ చేయనున్నారు. ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్టైనర్ గా ఉందనున్న ఈ సినిమాలో స్ట్రార్ కామెడీయన్ బ్రహ్మానందం, విద్యుల్లేఖ రామన్ లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. నిర్మాత ఎమ్. ఎల్ కుమార్ చౌదరి నిర్మిస్తున్న ఈ చిత్రంలో విష్ణు సరసన ప్రగ్య జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది.

 
Like us on Facebook