తారక్ ప్రాజెక్ట్ కి “ఆచార్య” హీరోయిన్ ని రిపీట్ చేయనున్నారా?

Published on Jul 17, 2021 5:27 pm IST

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి మరియు మెగా తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లతో దర్శకుడు కొరటాల శివ “ఆచార్య” అనే బిగ్ బడ్జెట్ మల్టీ స్టారర్ చిత్రం తీస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు షూటింగ్ ఫైనల్ దశకు చేరుకున్న ఈ చిత్రంలో మెగాస్టార్ సరసన కాజల్ అగర్వాల్ చరణ్ సరసన పూజా హెగ్డేలు హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

మరి వీరిలో పూజా హెగ్డే ని కొరటాల నెక్స్ట్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో చేస్తున్న ప్రాజెక్ట్ లో ఫిక్స్ చేయనున్నారని బజ్ వినిపిస్తుంది. అయితే ఆ రోల్ కి ఆల్రెడీ మరో స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ పేరు కూడా ఉంది. మరి ఈ టాక్ లో ఎంత నిజముందో చూడాలి.

ప్రస్తుతానికి అయితే తారక్ తన భారీ ప్రాజెక్ట్ రౌద్రం రణం రుధిరం లో బిజీగా ఉన్నాడు. అలాగే తన మరో బిగ్గెస్ట్ గ్రాండ్ టెలివిజన్ రియాలిటీ షో “ఎవరు మీలో కోటీశ్వరులు” షోలో కూడా బిజీగా ఉన్నాడు. మరి దీనిలో మొదటి గెస్ట్ గా “RRR”లో తన నటిస్తున్న మరో స్టార్ హీరో రామ్ చరణ్ రానున్నాడన్న టాక్ కూడా ఉంది.

సంబంధిత సమాచారం :