సరికొత్తగా సోనూ సూద్…పోస్టర్ తో విషెస్ తెలిపిన ఆచార్య టీమ్!

Published on Jul 30, 2021 8:07 pm IST

మెగాస్టార్ చిరంజీవి హీరోగా, కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ఆచార్య. ఈ చిత్రం లో ప్రముఖ నటుడు సోనూ సూద్ నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే నేడు సోనూ సూద్ పుట్టిన రోజు కావడం తో చిత్ర యూనిట్ ఒక పోస్టర్ ను విడుదల చేయడం జరిగింది. సోనూ సూద్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ, విడుదల అయిన పోస్టర్ లో సోనూ సూద్ సరికొత్తగా ఉన్నారు.

అయితే సోనూ సూద్ పాత్ర ఎలా ఉంటుందో చెప్పే విధంగా ఈ పోస్టర్ ఉండటం గమనార్హం. శ్రీమతి కొణిదెల సురేఖ సమర్పణ లో కొణిదెల ప్రొడక్షన్ కంపనీ మరియు మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై ఈ చిత్రాన్ని రామ్ చరణ్ నిర్మిస్తున్నారు. రామ్ చరణ్ ఈ చిత్రం లో సిద్ద పాత్రలో నటిస్తుండగా, రామ్ చరణ్ సరసన హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తుంది. ఈ చిత్రానికి సంగీతం మణిశర్మ అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :