“ఆచార్య” షూట్ కు టైం లాక్ చేసారా?

Published on Sep 24, 2020 9:00 am IST

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం “ఆచార్య”. పుష్కలమైన మాస్ ఎలిమెంట్స్ కు తోడుగా మంచి సందేశంతో కూడిన చిత్రాలను అందించడంలో దిట్ట అయిన వరుస విజయ చిత్రాల దర్శకుడు కొరటాల శివ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ చిత్రం ఇప్పటికీ సగానికి పైగా షూట్ ను పూర్తి చేసుకొని ఇంకా చాలా బ్యాలన్స్ ఉంచుకుంది.

కానీ ఇపుడు పరిస్థితు ఏమంత బాగుండకపోయేసరికి అలా వాయిదా పడుతూనే వస్తుంది. దీనితో కొరటాల ఈ చిత్రానికి స్పెషల్ ప్లానింగ్స్ వేస్తుండడంతో చిరు తొందరలోనే సెట్స్ మీదకు రానున్నారు. అయితే ఇపుడు లేటెస్ట్ సమాచారం ప్రకారం ఈ చిత్రం రెగ్యులర్ షూట్ ను వచ్చే నవంబర్ కు లాక్ చేసినట్టుగా తెలుస్తుంది.

ఈలోపల కొరటాల అనుకున్న టెస్ట్ షూట్ ను పూర్తి చేసుకొని అప్పటికి మొత్తం సెట్ చెయ్యాలని భావిస్తున్నారట. వచ్చే ఏడాది వేసవి కానుకగా ఈ చిత్రాన్ని రెడీ చెయ్యాల్సి ఉంది. మరి ఈ చిత్రం విషయంలో ఏం జరగనుందో చూడాలి. ఈ చిత్రంలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఒక కీలక పాత్ర పోషించనుండగా మెగాస్టార్ ఆల్ టైం మ్యూజికల్ హిట్ డైరెక్టర్ మణిశర్మ సంగీతం అందిస్తుండగా మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More