పవర్ ఫుల్ రోల్ లో ‘యాక్షన్ హీరో’ !

Published on Feb 16, 2020 10:00 pm IST

యాక్షన్ హీరో గోపీచంద్‌ ప్రస్తుతం సంపత్‌ నంది దర్శకత్వంలో ఒక స్పోర్ట్స్‌ బేస్డ్‌ సినిమా ‘సీటీమార్‌’ చేస్తోన్న సంగతి తెలిసిందే. అయితే గోపీచంద్ గత కొన్నేళ్ళుగా సూపర్ హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఎన్నో ఆశలతో చేసిన ‘చాణక్య’ కూడా నిరాశపరచడంతో తరువాత సినిమా విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ముఖ్యంగా సరైన దర్శకులతోనే సినిమాలను ప్లాన్ చేసుకుంటున్నాడు. తనకు నటుడిగా లైఫ్ ఇచ్చి ఇండస్ట్రీలో తనను నిలబెట్టినా దర్శకుడు తేజతో గోపీచంద్ సినిమా చేయబోతున్నాడు.

కాగా తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం డైరెక్టర్ తేజ గోపీచంద్‌ కోసం ఓ యాక్షన్ స్క్రిప్ట్ ను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ స్క్రిప్ట్ విషయంలో వీరిద్దరి మధ్య చర్చలు కూడా జరిగాయట. పూర్తిగా పాత్ర బలంతో నడిచే కథ కావడంతో గోపీచంద్ కి కూడా బాగా నచ్చిందని తెలుస్తోంది. అన్నీ కుదిరితే సమ్మర్ తరువాత నుండి వీరి సినిమా పట్టాలైక్కే అవకాశముంది. మొత్తానికి మరో పవర్ ఫుల్ రోల్ లో యాక్షన్ హీరో నటించబోతున్నాడు.

కాగా డైరెక్టర్ తేజ దర్శకత్వంలో వచ్చిన ‘జయం, నిజం’ సినిమాలతో ప్రతినాయకుడిగా నిలదొక్కుకున్న గోపీచంద్ ఈ సారి హీరోగా తేజ దర్శకత్వంలో సూపర్ హిట్ అందుకుంటాడేమో చూడాలి.

సంబంధిత సమాచారం :

X
More