నటుడు కాదంబరి నేతృత్వంలో ఉచిత వైద్య శిబిరం

నటుడు కాదంబరి నేతృత్వంలో ఉచిత వైద్య శిబిరం

Published on Aug 10, 2019 11:56 PM IST

నేడు నటుడు కాదంబరి చిత్రపురి కాలనిలో కార్మిక కొరకు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది.మనం సైతం పౌండేషన్ ఆద్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యుడు రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, జనసేన నేత జెడి లక్ష్మి నారాయణ అతిధులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నటుడు కాదంబరి మాట్లాడుతూ ఒక పేద వాడిగా పేదల కష్టాలు నాకు తెలుసు, వివిధ రాష్ట్రాల నుండి అనేక మంది కార్మికులు పొట్టకూటి కోసం ఇక్కడి వస్తున్నారు. అలాంటి పేద కార్మికుల కొరకు ఈ వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది అన్నారు. నేను ఈ పార్టీకి చెందినవాడిని కాను, కానీ పేదవారి కొరకు నావంతు సాయం చేస్తాను అన్నారు. అలాగే ముఖ్య అతిధులుగా హాజరైన వారికి కృతజ్ఞలు తెలిపారు.

జేడీ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ…కాదంబరి కిరణ్ అలుపు ఎరుగని సేవా సైనికుడు. నిత్యం పేదల కోసమే ఆలోచిస్తుంటాడు. వాళ్లకు అండగా ఉంటూ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంటాడు. సినిమాల్లో నటిస్తూ ఇంత తీరిక ఈయనకు ఎలా దొరుకుతుంది అని ఆశ్చర్యమేస్తుంటుంది. కిరణ్ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు అద్భుతం. అన్నింటికంటే ముఖ్యమైనది ఆరోగ్యం. దాన్ని కాపాడుకుంటేనే ఏదైనా సాధించగలం. కాదంబరి ఆ విషయాన్ని గుర్తించి మీకు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. అన్నారు.

మనం సైతం సేవా కార్యక్రమాలు ఎంతో స్ఫూర్తివంతంగా ఉన్నాయంటూ కాదంబరిని ప్రశంసించారు ఎమ్మెల్యే ఫ్రకాష్ గౌడ్, ఎంపీ రంజిత్ రెడ్డి. మనంసైతంకు తాము కూడా అండగా ఉంటామని వారు ప్రకటించారు. మనం సైతం సభ్యులు వల్లభనేని అనిల్, రమేష్ వర్మ, శ్రీధర్ రెడ్డి, వినోద్ బాల, చిత్రపురి కాలనీ పెద్దలు మహానంద రెడ్డి, కృష్ణ మోహన్ రెడ్డి తదితరులు కార్యక్రమాన్ని నడిపించారు. ఈ సందర్భంగా మెడికవర్, నేత్రాలయా ఆస్పత్రుల సిబ్బంది కార్మికులకు వైద్యపరీక్షలు నిర్వహించి తగిన మందులు అందజేశారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు