నరసింహాపురం ప్రతీ ఒక్కరికీ ఎంతో ప్రత్యేకం – హీరో నంద కిషోర్

నరసింహాపురం ప్రతీ ఒక్కరికీ ఎంతో ప్రత్యేకం – హీరో నంద కిషోర్

Published on Aug 2, 2021 12:00 PM IST

narasimhapuram
జులై 30న విడుదలైన ఫ్యామిలీ ఓరియంటెడ్ యాక్షన్ ఎంటర్టైనర్ నరసింహపురం చిత్రం పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. హీరో నందకిషోర్ నటన, శ్రీరాజ్ బళ్లా దర్శకత్వ ప్రతిభ ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఈ సందర్భంగా చిత్ర బృందం విజయ సమావేశం ఏర్పాటు చేసి, కేక్ కట్ చేసి తమ ఆనందాన్ని పంచుకోవడం జరిగింది.

అయితే ఈ చిత్రాన్ని గుండెలకు హత్తుకుంటున్న ప్రేక్షకులకు హీరో నందకిషోర్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ విజయం తనకే కాకుండా, ఈ చిత్రంలో నటించిన, ఈ చిత్రం కోసం పని చేసిన ప్రతి ఒక్కరికీ ఎంతో ప్రత్యేకం అని పేర్కొన్నారు. రెండేళ్ల తమ కష్టానికి ప్రతిఫలం దక్కుతుండడం పట్ల దర్శకనిర్మాతలు శ్రీరాజ్ బళ్లా ఫణిరాజ్ గౌడ్ లు సంతోషం వ్యక్తం చేశారు. సూపర్ హిట్ దిశగా దూసుకుపోతున్న నరసింహపురం చిత్రంలో నటించే, పని చేసే అవకాశం ఇచ్చిన దర్శకనిర్మాతలకు ఉష, కల్యాణ మాధవి, సంపత్ కుమార్, సాయి రాజ్, సంగీత దర్శకుడు ఫ్రాంక్లిన్ సుకుమార్, గీత రచయిత గెడ్డం వీరు కృతజ్ఞతలు తెలిపారు.

అయితే నిర్మాతగా తనకు మూడు కమర్షియల్ సక్సెస్ లు ఇచ్చిన శ్రీరాజ్ నరసింహపురం తో సూపర్ హిట్ కొట్టడం గర్వంగా ఉందన్నారు ముఖ్య అతిథి తుమ్మలపల్లి. యూనిట్ సభ్యులందరికీ ఆయన అభినందనలు తెలిపారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు