నాని నిర్మించిన సినిమా ఫస్ట్ లుక్ వచ్చేస్తోంది !
Published on Nov 25, 2017 11:11 am IST

నాని హీరోగా సక్సెస్ ఫుల్ సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. కొన్ని నెలల క్రితం ప్రశాంత్ అనే షార్ట్ ఫిలిం మేకర్ ఒక పాయింట్ చెప్పడంతో అది నచ్చి నాని నిర్మాతగా మారాడు. ప్రశాంత్ దర్శకత్వం వహించిన ఈ సినిమా దాదాపు పూర్తి అయ్యింది. ఈ రోజు సాయంత్రం ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చెయ్యబోతున్నారు.

వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ లో ప్రొడక్షన్ నెంబర్ వన్ గా తెరకెక్కిన ఈ సినిమాతో కొత్త హీరో హీరోయిన్ పరిచయం కాబోతున్నారు. ప్రస్తుతం నాని దిల్ రాజు బ్యానర్ లో వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఎం.సి.ఎ సినిమాలో నటిస్తున్నాడు. అలాగే మేర్లపాక గాంది దర్శకత్వంలో మరో సినిమా చేయ్యబోతున్నాడు. నాని నిర్మాణంలో మరికొంతమంది కొత్త దర్శకులు పరిచయం అవ్వాలని కోరుకుందాం.

 
Like us on Facebook