హైదరాబాద్ లో ఒక్కటి కూడా అందుబాటులో లేదు…పుష్ప టికెట్స్ పై రాహుల్ రవీంద్రన్ కామెంట్స్!

Published on Dec 16, 2021 10:25 pm IST


అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప ది రైస్ చిత్రం రేపు డిసెంబర్ 17 వ తేదీన విడుదల కానుంది. ఈ చిత్రం పాన్ ఇండియా మూవీ గా వస్తుండటం, అల వైకుంఠ పురంలో లాంటి భారీ బ్లాక్ బస్టర్ చిత్రం తర్వాత అల్లు అర్జున్ నటిస్తున్న సినిమా కావడం, సుకుమార్ దర్శకత్వం లో రావడం తో భారీ అంచనాలు నెలకొన్నాయి.

అయితే ఆన్లైన్ లో పెట్టిన కొద్ది సేపటికి టికెట్స్ భారీగా అమ్ముడు అవ్వడం చూస్తూనే ఉన్నాం. తాజాగా నటుడు రాహుల్ రవీంద్రన్ సోషల్ మీడియా వేదిక గా పుష్ప చిత్రం టికెట్స్ కి సంబంధించి పలు ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు. పుష్ప చిత్రం టికెట్లు అడిగే వ్యక్తుల నుండి వచ్చిన ఫోన్ కాల్స్ కి సమాధానం ఇవ్వడం తోనే తన రోజులో సగం గడిచి పోయింది అని అన్నారు. హైదరాబాద్ లో ఒక్కటి కూడా అందుబాటులో లేదు అని, తిరిగి తానే టికెట్స్ అడిగిన విషయాన్ని వెల్లడించారు. ఒక పెద్ద చిత్రం తో మళ్ళీ సమయం ఎంతో ఎగ్జైటింగ్ గా గడుస్తుంది అని, పుష్ప బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకున్నారు.

సంబంధిత సమాచారం :