రష్మికను ఆ విలన్ మామూలుగా ఏడిపించలేదట

Published on Aug 1, 2019 1:16 pm IST

విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మంద‌న్నా జంట‌గా న‌టించిన చిత్రం డియ‌ర్ కామ్రేడ్‌. ఫైట్ ఫ‌ర్ వాట్ యు ల‌వ్‌ అనేది ట్యాగ్ లైన్‌. భ‌ర‌త్ క‌మ్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. మైత్రీ మూవీ మేక‌ర్స్‌, బిగ్ బెన్ సినిమాస్ ప‌తాకాల‌పై న‌వీన్ ఎర్నేని, య‌ల‌మంచిలి ర‌విశంక‌ర్‌, మోహ‌న్ చెరుకూరి, య‌ష్ రంగినేని సంయుక్త‌గా నిర్మించారు. గత నెల 26న తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ భాష‌ల్లో భారీగా విడుద‌ల చేశారు.

కాగా డియర్ కామ్రేడ్ చిత్రంలో అమ్మాయిలను లైంగిక వేధింపులకు గురిచేసే క్రికెట్ జట్టు సెలెక్టర్ పాత్ర‌లో నటించిన రాజ్ అర్జున్ నటనకు సర్వత్రా ప్రశంసలు దక్కుతున్నాయి.’డియర్ కామ్రేడ్’ లో ప్రతి నాయుకుడిగా ఆయన చాలా బాగా చేశారు. ఈ సందర్భంగా విలేకరులతో ముచ్చటించిన రాజ్ అర్జున్ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

బాలీవుడ్ కి చెందిన రాజ్ అర్జున్ ని దర్శకుడు భరత్ కమ్మ ‘సీక్రెట్ సూపర్ స్టార్’ సినిమాలో నటన చూసి ఈ చిత్రానికి ఎంపిక చేశారన్నారు. అలాగే డెడికేషన్, కమిట్మెంట్ కలిగిన నటుడంటూ హీరో విజయ్ పై ప్రశంసలు కురిపించిన రాజ్ అర్జున్, క్లైమాక్స్ లో రష్మిక మిమ్మల్ని చెంపపై కొట్టినప్పుడు ఎలా ఫీలయ్యారు అన్న ప్రశ్నకు ఆనందంగా ఫీలయ్యాను అని ఆసక్తికర సమాధానం చెప్పారు.

ఎందుకంటే కథలో భాగంగా, మానసికంగా,శారీరకంగా ఆమెను చాలా ఇబ్బందులకు గురిచేశాను. సీన్ అయిపోయిన తరువాత కూడా ఆమె అరగంట వరకు ఏడుస్తూ ఉండేవారు. నేను దగ్గరికెళ్లి ఓదార్చేవాడిని అన్నారు. ప్రస్తుతం రాజ్ అర్జున్ కరణ్ జోహార్ నిర్మిస్తున్న “పీర్ షా” అనే చిత్రంలో నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం :