నటుడు శరత్ బాబు ఆరోగ్యం పై లేటెస్ట్ అప్డేట్!

Published on May 4, 2023 7:29 pm IST


అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న సీనియర్ నటుడు శరత్ బాబు ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఏఐజీ హాస్పిటల్స్‌లో చికిత్స పొందుతున్నారు. నిన్న శరత్ బాబు ఆరోగ్య పరిస్థితిపై కొన్ని నిరాధారమైన పుకార్లు పుట్టుకొచ్చాయి. ఇది అభిమానులను షాక్ కి గురి చేసింది. అయితే శరత్ బాబు సోదరి ఆ పుకార్లను కొట్టిపారేసింది. తన సోదరుడు నెమ్మదిగా కోలుకుంటున్నాడని స్పష్టం చేసింది. దీంతో అభిమానులకు భారీ ఊరట లభించింది.

ఇప్పుడు AIG హాస్పిటల్స్ ఒక హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది, అది శరత్ బాబు యొక్క క్లినికల్ స్టేటస్ క్రిటికల్‌గా ఉందని, అయితే అతని హెల్త్ స్థిరంగా ఉన్నట్లు పేర్కొంది. ఎలాంటి వదంతులను వ్యాప్తి చేయవద్దని తెలిపారు. శరత్‌బాబు కుటుంబం నుంచి గానీ, ఏఐజీ హాస్పిటల్స్‌ ప్రతినిధుల నుంచి గానీ వచ్చే వార్తలను మాత్రమే ప్రజలు నమ్మాలని స్పష్టం చేశారు. ఆసుపత్రి అధికారులు ఆ ప్రముఖ నటుడి ఆరోగ్య స్థితిని ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూనే ఉంటారని కూడా చెప్పడం జరిగింది.

సంబంధిత సమాచారం :