ఒకప్పటి సీరియస్ విలన్ దర్శకుడిగా మారాడు

Published on Oct 13, 2019 3:00 am IST

దాదాపు రెండు దశాబ్దాలు విలన్ గా అనేక చిత్రాలలో నటించాడు నటుడు సత్యప్రకాష్. పోలీస్ స్టోరీ, పెళ్లిచేసుకుందా, సీతారామరాజు, సీతయ్య వంటి చిత్రాలలో సత్య ప్రకాష్ కీలకమైన విలన్ రోల్స్ చేసి మెప్పించారు. కాగా ఈ సీనియర్ విలన్ ఇప్పుడు దర్శకుడిగా మారాడు. ఉల్లాలా ఊల్లాల అనే చిత్రానికి ఆయన దర్శకత్వం వహించడం జరిగింది. కాగా ఈ చిత్రానికి సంబందించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ని విక్టరీ వెంకటేష్ లాంచ్ చేశారు.

నటరాజ్ పేరి, నూరీన్ షెరీఫ్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని సుఖీభవ మూవీస్ బ్యానర్ పై గురు రాజ్ అత్తారి నిర్మిస్తున్నారు.ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మూవీ విశేషాలు పంచుకున్నారు. యూత్ ఫుల్ లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీ విజయం పై దర్శక నిర్మాతలు ఆశాభావం వ్యక్తం చేశారు.

సంబంధిత సమాచారం :

X
More