“మెమరీ ఇన్ మేకింగ్” అంటూ దేవి 70 ఎంఎం వద్ద తిమ్మరుసు పోస్టర్ తో సత్యదేవ్!

Published on Jul 29, 2021 10:50 am IST


తెలుగు సినీ పరిశ్రమలో నటుడు గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సత్యదేవ్, తన తదుపరి చిత్రం తిమ్మరుసు తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యారు. ఇప్పటికే ఈ చిత్రం ట్రైలర్ విడుదల అయ్యి ప్రేక్షకులను విశేషం గా ఆకట్టుకుంటుంది. తాజాగా విడుదల అయిన లిఫ్ట్ ఫైట్ స్నేక్ పీక్ సైతం సినిమా పై భారీ అంచనాలను నెలకొల్పింది.

అయితే ఈ చిత్రం జూలై 30 వ తేదీన థియేటర్ల లో విడుదల కాబోతుంది. ఇప్పటికే అందుకు సంబంధించిన ప్రమోషన్స్ షురూ అయింది. అయితే చాలా రోజుల తర్వాత థియేటర్లు ప్రారంభం కావడం తో సినీ అభిమానులు, ప్రేక్షకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సత్యదేవ్ సైతం తిమ్మరుసు కోసం హైదరాబాద్ లోని దేవి 70 ఎంఎం థియేటర్ వద్దకు చేరుకున్నాడు. మెమరీ ఇన్ మేకింగ్ అంటూ సంతోషం వ్యక్తం చేశారు. దేవీ 70 ఎంఎం థియేటర్ లో తొలి ఆట పడుతుంది అంటూ చెప్పుకొచ్చారు. తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల మొదటి ఆట పడుతుంది అని, అందులో దేవి ముందుగా ఉంటుదని తెలిపారు.

చాలా ఆసక్తి గా ఎదురు చూస్తున్నట్లు చెప్పుకొచ్చారు సత్యదేవ్. సినిమా ను ప్రేక్షకులకు చూపించేందుకు చాలా ఎదురు చూస్తున్నాం అని అన్నారు. తిమ్మరుసు మీకు దగ్గర ఉన్న థియేటర్ల లో చూడండి అంటూ చెప్పుకొచ్చారు. ఈ చిత్రం లో ప్రియాంక జవాల్కర్ హీరోయిన్ గా నటిస్తుండగా, శరణ్ కొప్పీ శెట్టి చిత్రానికి దర్శకత్వం వహించారు.

సంబంధిత సమాచారం :