చికెన్ పన్నీర్‌ వండిన హీరో !

Published on Jul 3, 2021 9:12 pm IST

కోలీవుడ్‌ లో ప్రెజెంట్ మోస్ట్‌ ఎలిజిబుల్ బ్యాచిలర్‌ అంటే ముందుగా గుర్తుకొచ్చేది హీరో శింబునే. ఎలాగూ పెళ్లి కాలేదు కాబట్టి, ఈ లాక్‌ డౌన్‌ లో ఈ బోల్డ్ హీరో ఇంటికే పరిమితమయ్యాడు. అయితే ఇంట్లో శింబు కేవలం రెండో రెండు పనులు చేసాడట. ఒకటి వంట, రెండు జిమ్. ఆ మధ్య తన బరువును బాగా తగ్గించి మరింత స్లిమ్‌ గా మారిన స్టిల్స్ ను వదిలి మొత్తానికి తన ఫ్యాన్స్ ను సర్ ప్రైజ్ చేశాడు.

తాజాగా ఇపుడు వంట గదిలో గరిటతిప్పుతూ తన వంట చాతుర్యాన్ని కూడా సక్సెస్ ఫుల్ గా ప్రదర్శించాడు. శింబు స్వయంగా చికెన్ పన్నీర్‌ ను తయారు చేసి, తన ఫ్యామిలీ మెంబర్స్ కు రుచి చూపించాడు. పైగా ఇదంతా వీడియో తీసి తన సోషల్‌ మీడియా ఎకౌంట్ లో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్‌ అవుతుంది.

ఇక సినిమాల విషయానికి శింబు నటించిన కొత్త సినిమా ‘మానాడు’ చిత్రం త్వరలోనే విడుదలకు రెడీగా ఉంది. ఈ సినిమాతో పాటు శింబు నుండి ‘పత్తుతల’, ’మహా’, ‘నదిగళిలే నీరాడుమ్‌ సూరియన్‌’ వంటి సినిమాలు కూడా రానున్నాయి.

సంబంధిత సమాచారం :