సునీల్ మళ్ళీ ట్రాక్ ఛేంజ్ చేశాడా..!

Published on Aug 4, 2021 2:50 am IST

కమెడీయన్‌గా కెరిర్ ప్రారంభించి మంచి గుర్తింపు తెచ్చుకున్న సునీల్ ఆ తర్వాత ట్రాక్ మార్చి హీరోగా మారిపోయాడు. హీరోగా సునీల్ పలు సినిమాలు చేసినా ఆయన చేసిన సినిమాల్లో కేవలం ఒకటి, రెండు సినిమాల్లో మాత్రమే ఒకే అనిపించాయి. దీంతో ఇక సమయం వృధా చేయకూడదని భావించిన సునీల్ మళ్లీ ట్రాక్ మార్చి సపోర్టింగ్ రోల్స్ వైపు మళ్లాడు. ప్ర‌స్తుతం ప‌లు చిత్రాల్లో కీలక పాత్రల్లో న‌టిస్తున్నాడు.

ఈ సమయంలో సునీల్ మళ్లీ హీరో ట్రాక్‌లోకి అడుగుపెట్టాడు. అంజి డైరెక్ష‌న్‌లో తెర‌కెక్కుతున్న మూవీలో సునీల్ లీడ్ రోల్ పోశిస్తున్నట్టు తెలుస్తుంది. ఇంట్రెస్టింగ్ సైక‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కుతున్న ఈ చిత్రానికి మేక‌ర్స్ ‘బుజ్జి ఇలా రా’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారట. ఈ సినిమాలో క‌మెడియ‌న్ ధన్ రాజ్ మ‌రో లీడ్ రోల్ పోశిస్తుండగా చాందిని త‌మిళ‌ర‌స‌న్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. అయితే క‌మెడియ‌న్ నుంచి హీరోగా మారిన త‌ర్వాత సునీల్ కెరీర్ సైడ్ ట్రాక్ అయిన విష‌యం తెలిసిందే. ప్రస్తుతం సపోర్టింగ్ రోల్స్‌తో బాగానే కెరిర్ నడుస్తున్న సమయంలో సునీల్ మళ్లీ హీరోగా ఎందుకు రిస్క్ చేస్తున్నాడని సినీ జనాలు అనుకుంటున్నారు.

సంబంధిత సమాచారం :