‘బాహుబలి’ కోసం యావత్‌దేశం ఎదురుచూస్తోంది : సూర్య

‘బాహుబలి’ కోసం యావత్‌దేశం ఎదురుచూస్తోంది : సూర్య

Published on May 19, 2015 9:50 AM IST

suriya-prabhas
సరికొత్త కథలతో, విభిన్న గెట‌ప్‌లతో మనల్ని మెప్పిస్తూ ఉండే తమిళ సూపర్ స్టార్ సూర్య, తాజాగా ‘మాస్’ పేరుతో మరో సరికొత్త కథతో మనముందుకు రానున్న విషయం తెలిసిందే! ఈ సినిమా తెలుగులో రాక్షసుడు పేరుతో విడుదల కానుంది. తెలుగు వర్షన్ ‘రాక్షసుడు’కి సంబంధించిన ఆడియో ఆవిష్కరణ వేడుక నిన్న సాయంత్రం హైద్రాబాద్‌లో జరిగింది. ఈ వేడుకకు హీరో సూర్యతో పాటు ‘రాక్షసుడు’ సినిమా యూనిట్‌ పాల్గొన్నారు. ఇదే వేడుకకు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, ప్రముఖ దర్శకుడు కోదండరామి రెడ్డిలు ముఖ్య అతిథులుగా విచ్చేశారు.

ఈ సందర్భంగా సూర్య మాట్లాడుతూ.. “తెలుగు ప్రేక్షకులు నాపై చూపుతున్న ప్రేమకు చాలా సంతోషంగా ఉంది. మీ అందరికీ నచ్చేలా రాక్షసుడు ఉంటుందని కచ్చితంగా చెప్పగలను” అంటూ ఉద్వేగంతో మాట్లాడారు సూర్య. ఇంకా మాట్లాడుతూ.. దర్శకుడు రాజమౌళి, ప్రభాస్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న బాహుబలిపై ప్రశంసల వర్షం కురిపించారు. “బాహుబలి సినిమా ఓ వండర్. దేశం మొత్తం ఈ సినిమా కోసం ఎదురుచూస్తోంది. తమిళ పరిశ్రమ కూడా బాహుబలి కోసం ఎప్పట్నుంచో ఎదురుచూస్తోంది. ఈ సినిమాను ప్రమోట్ చేయడం మనందరి బాధ్యత” అంటూ బాహుబలి విజయంపై నమ్మకం వ్యక్తం చేశారు సూర్య.

తాజా వార్తలు