తండ్రిని కోల్పోయిన అమలాపాల్

Published on Jan 22, 2020 10:10 am IST

హీరోయిన్ అమలాపాల్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆమె తండ్రి పాల్ వర్గీస్ కన్నుమూశారు. 61 ఏళ్ల వయసున్న ఆయన గత కొన్నిరోజులుగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ కొచ్చి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. విషయం తెలుసుకున్న అమలాపాల్ వెంటనే కొచ్చి బయలుదేరి వెళ్ళారు.

ఆయన అంత్యక్రియలు ఈరోజు సాయంత్రం కురుప్పంపాడు చర్చి నందు జరగనున్నాయి. అమలపాల్ సినిమాల్లోకి రావడం ఆమె తండ్రికి మొదటి నుండి ఇష్టం లేదు. అయినా బలవంతం మీద ఆయన్ను ఒప్పించి సినీ రంగంలోకి వచ్చిన అమలాపాల్ తక్కువ కాలంలోనే తమిళం, తెలుగు, మలయాళ పరిశ్రమల్లో సినిమాలు చేసి నటిగా మంచి పేరు తెచ్చుకుంది.

సంబంధిత సమాచారం :