సినీ నటికి వేధింపులు, ఆపై దాడి

సినీ నటికి వేధింపులు, ఆపై దాడి

Published on Mar 30, 2015 6:30 PM IST

actress-stipped
తమిళ సినిమాల్లో క్యారెక్టర్ పాత్రలు వేసే ఓ నటికి విపత్కర పరిస్థితి ఎదురైంది. చెన్నై పరిసర ప్రాంతాల్లో ఇద్దరు నిందితులు ఆమెను రోడ్డు మధ్యలో ఆపి వేధింపులకు పాల్పడ్డారు. ఆ నిందితులు ఆమె వేసుకున్న దుస్తులను కూడా చింపివేశారు. ఏమీ పాలుపోని స్థితిలో ఆమె అక్కణ్ణుంచి పారిపోయింది. బాధితురాలు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

వేధింపులకు పాల్పడ్డ ఇద్దరి సమాచారం పోలీసుల వద్ద సిద్ధంగా ఉండడంతో త్వరలోనే వాళ్ళను పట్టుకునేందుకు పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు. బాధితురాలు గతంలో జాతీయ అవార్డూ దర్శకుడు బాలా రూపొందించిన నాన్ కదవుల్ (నేను దేవుణ్ణి) చిత్రంలో ఓ కీలక పాత్రలో నటించింది.

తాజా వార్తలు