కాంగ్రెస్ పార్టీలో ఖుష్భూకి పెద్ద పదవి!

కాంగ్రెస్ పార్టీలో ఖుష్భూకి పెద్ద పదవి!

Published on Mar 26, 2015 8:54 PM IST

kushboo12
తన అందంతో, నటనతో దక్షిణాది సినీ పరిశ్రమలో చెరగని ముద్ర వేసిన నటి, ఖుష్బూ. ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో ఉండే ఖుష్భూ రాజకీయాల్లోనూ చురుగ్గా పాల్గొంటారు. కొన్నాళ్ళ పాటు డీఎమ్‌కె పార్టీకి సేవలందించిన ఆమె, ఆ తర్వాత ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు. డీఎమ్‌కెకి గుడ్‌బై చెప్పినపుడు రాజకీయాలకూ దూరంగా ఉంటానని చెప్పుకొచ్చిన ఖుష్భూ, కొన్నాళ్ళకు కాంగ్రెస్ పార్టీలో చేరి అందరినీ ఆశ్చర్యపరచింది. గత ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూసిన కాంగ్రెస్, ఇప్పుడు దిద్దుబాటు చర్యలకు దిగింది.

ఈ చర్యల్లో భాగంగానే కాంగ్రెస్ కొత్త వ్యక్తులకు బాధ్యతలను అప్పగిస్తోంది. ఆ క్రమంలో ఖుష్భూని జాతీయ స్థాయి పదవి వరించడం విశేషం. జాతీయ స్థాయిలో మీడియా ప్రతినిధిగా ఆమెను నియమించారు. మాటల్లో చురుకు, వేగం, స్పష్టత సొంతం చేసుకున్న ఖుష్భూ పార్టీని బలంగా జనాల్లోకి తీసుకెళ్ళగలదని కాంగ్రెస్ భావిస్తోంది. తమ పార్టీలో చేరిన అతి తక్కువ కాలంలోనే ఖుష్బూకి ఇంతటి పదవి దక్కడం నిజంగానే ఆసక్తిని రేకెత్తిస్తోంది.

జనాల్లో ఆమెకున్న క్రేజే ఆమెకీ పదవిని తెచ్చిపెట్టిందని విశ్లేషకుల అభిప్రాయం. ఇక రాజకీయాలను అలా ఉంచితే.. సినిమాల్లోనూ ఖుష్భూ అడపదడపా కనిపిస్తూనే ఉన్నారు. ఖుష్భూ భర్త సి. సుందర్ దర్శకత్వంలో రూపొందిన సమ్‌థిం సమ్‌థింగ్ తర్వాత ఆమె తెలుగులో వేరే సినిమా చేయలేదు.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు