నన్ను కలవాలంటే ఆయన్ని అడగండి- సిమ్రాన్

Published on Feb 12, 2020 7:09 pm IST

సుమన్ హీరోగా వచ్చిన అబ్బాయిగారి పెళ్లి సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ సిమ్రాన్. 1999లో వచ్చిన సమర సింహారెడ్డి మూవీతో ఇండస్ట్రీ హిట్ అందుకున్న సిమ్రాన్ కలిసుందాంరా, నువ్వు వస్తావని, నరసింహ నాయుడు వంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలలో నటించింది. దాదాపు దశాబ్దం పాటు సిమ్రాన్ టాప్ హీరోయిన్ గా కొనసాగింది. తమిళంలో అడపాదడపా చిత్రాలు చేస్తున్న ఆమె తెలుగులో మాత్రం సినిమాలు చేయడం లేదు. ఇక ఆమె ప్రస్తుతం మాధవన్ హీరోగా తెరకెక్కుతున్న రాకెటరీ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం మాజీ ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతుంది.

కాగా ట్విట్టర్ వేదికగా ఆమె తన పబ్లిసిస్ట్ ని పరిచయం చేశారు. తమిళ పబ్లిసిస్ట్ యువరాజ్ ని ఆమె నియమించుకున్నారట, ఆమెతో మీటింగ్స్, ఇంటర్వూస్, అప్పాయింట్మెంట్స్, షెడ్యూల్స్ కి సంబంధించి ఏ విషయమైనా ఆయన్ని కలవమని ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. సిమ్రాన్ 2003లో తన బాల్యమిత్రుడు దీపక్ ని పెళ్లాడారు. వారికిప్పుడు ఇద్దరు కొడుకులు.

సంబంధిత సమాచారం :