“ఆదిపురుష్” ని కూడా అలాగే ప్లాన్ చేస్తున్నారట.!

Published on Apr 28, 2021 3:08 pm IST

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ అండ్ భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ చిత్రాల్లో దర్శకుడు ఓంరౌత్ తెరకెక్కిస్తున్న చిత్రం “ఆదిపురుష్” కూడా ఒకటి. ఇతిహాస గాథ రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ రామునిగా నటిస్తుండగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనోన్ సీత పాత్రలో నటిస్తుంది.

అయితే కొంతమేర షూట్ జరుపుకున్న ఈ చిత్రంపై తాజా టాక్ ఒకటి బయటకు వచ్చింది. ఈ చిత్రాన్ని దర్శకుడు ఓంరౌత్ తన లాస్ట్ చిత్రం “తనాజీ” తరహాలోనే ప్లాన్ చేస్తున్నారట. ఆ సినిమాకు వినియోగించిన 3డి టెక్నాలిజీనే ఈ సినిమాకు కూడా వారు ప్లాన్ చేస్తున్నట్టు నయా టాక్. అలాగే ఈ సినిమాకు పెట్టే బడ్జెట్ ప్రకారం దానికన్నా బెటర్ ఎక్స్ పీరియన్స్ ఆదిపురుష్ వస్తుంది అని తెలుస్తుంది.

అలాగే విజువల్ ఎఫెక్ట్స్ పరంగా కూడా మంచి అవుట్ పుట్ ఆదిపురుష్ ఉంటుందని తెలిసిందే. ఇక ఈ భారీ చిత్రంలో రావణ పాత్రలో సైఫ్ అలీఖాన్ నటిస్తుండగా సన్నీ సింగ్ లక్ష్మణ పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే ఈ చిత్రం హిందీ మరియు తెలుగు భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతుంది.

సంబంధిత సమాచారం :