లేటెస్ట్..50 రోజుల వేడుకల్లో “ఆదిపురుష్” టీం.!

Published on Jul 20, 2021 1:59 pm IST

మామూలుగా అంటే ఓ సినిమా రిలీజ్ అయ్యి హిట్ అయితే 50 రోజులు 100 రోజుల వేడుకలు జరుపుకుంటారన్న సంగతి అందరికీ తెలిసిందే. మరి ఇప్పుడు పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో ఒకటైన “ఆదిపురుష్” ఇంకా షూటింగ్ స్టేజ్ లో ఉన్న సినిమా 50 రోజుల వేడుక జరుపుకోవడం ఏమిటా అని ఆశ్చర్యపోతున్నారా.? ఇందులో ఎలాంటి అబద్దం లేదు నిజంగానే ఆదిపురుష్ టీం వారు 50 రోజుల వేడుక చేసుకున్నారట.

కాకపోతే 50 రోజుల షూటింగ్స్ విజయవంతంగా కంప్లీట్ చేసుకున్నందుకు ఈ వేడుకలు అన్నట్టు తెలుస్తుంది. వినడానికి కొత్తగా ఉన్నా ఇదే నిజం మేకర్స్ తమ సినిమా షూట్ 50 రోజులు కంప్లీట్ చేసుకోడంతో దాన్ని ఫ్లెక్స్ పెట్టుకొని మరీ సెలబ్రేట్ చేసుకున్నారు. దీనితో ఈ ఫొటోలే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి ఈ భారీ ప్రాజెక్ట్ ను ఓంరౌత్ దర్శకత్వం వహిస్తుండగా కృతి సనన్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :