“ఆదిపురుష్” ను మినిమమ్ అన్ని భాషల్లో ప్లాన్ చేస్తున్నారా?

Published on Sep 16, 2020 9:20 am IST

ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రిస్టేజియస్ ప్రాజెక్టులలో “ఆదిపురుష్” కూడా ఒకటి. బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై తారాస్థాయి అంచనాలు నెలకొన్నాయి. భారీ విజువల్ వండర్ లా ప్లాన్ చేస్తున్న ఈ ఇతిహాస గాథకు చాలా అత్యున్నత ప్లానింగులనే ఓంరౌత్ చేస్తున్నాడు.

క్యాస్టింగ్ నుంచి ఇతర ప్లానింగ్స్ వరకు రోజు ఏదొక బజ్ ఈ చిత్రంపై వినిపిస్తూనే ఉన్నది. ఒక పాన్ ఇండియన్ సినిమా అంటే మన దేశం వరకు వస్తే మినిమమ్ 4 నుంచి 5 భాషల్లో విడుదల ప్లాన్ చేస్తారు. అలాగే ఈ చిత్రాన్ని కూడా ఏక కాలంలో తెలుగు హిందీ భాషల్లో తెరకెక్కించి మరో మూడు భాషల్లో కలిపి విడుదల చేయనున్నారు.

ఆ తర్వాత మరిన్ని ఇతర భాషల్లో కూడా విడుదల చేస్తారు. అలా ఆదిపురుష్ చిత్రాన్ని మినిమమ్ 20 భాషలకు తగ్గకుండా డబ్ చెయ్యాలని చిత్ర యూనిట్ భావిస్తున్నారట. ఈ చిత్రంలో ప్రభాస్ రాముని పాత్రలో కనిపించనుండగా రావణునిగా సైఫ్ ను ఫిక్స్ చేసారు. వచ్చే ఏడాది ఆరంభంలో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ చిత్రం 2022లో విడుదల కానుంది.

సంబంధిత సమాచారం :

More