రీ-రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న టైమ్ ట్రావెల్ మూవీ ‘ఆదిత్య 369’

రీ-రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న టైమ్ ట్రావెల్ మూవీ ‘ఆదిత్య 369’

Published on Mar 18, 2025 3:58 PM IST

టాలీవుడ్‌లో లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన తొలి టైమ్ ట్రావెల్ చిత్రం ‘ఆదిత్య 369’ అప్పట్లో బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణ హీరోగా నటించగా మోహిని హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాలోని టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ ప్రేక్షకులకు సరికొత్తగా అనిపించడంతో ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించారు. ఇక ఇప్పుడు ఈ సినిమా రీ-రిలీజ్‌కు సిద్ధమయ్యింది.

ఇలాంటి క్లాసిక్ చిత్రాలను ఖచ్చితంగా రీ-రిలీజ్ చేయాలని అభిమానులు డిమాండ్ చేస్తుండటంతో, ఇప్పుడు ‘ఆదిత్య 369’ చిత్రాన్ని 4K వెర్షన్‌లో ఏప్రిల్ 11న గ్రాండ్ రీ-రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఇక వింటేజ్ బాలయ్యను మరోసారి థియేటర్లలో చూసి అభిమానులు ఎంజాయ్ చేయడం ఖాయమని చిత్ర వర్గాలు చెబుతున్నాయి.

ఈ సినిమాలో టిన్ను ఆనంద్, అమ్రీష్ పూరి, సిల్క్ స్మిత తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. ఇళయరాజా సంగీతం అందించిన ఈ చిత్రానికి రీ-రిలీజ్‌లో ఎలాంటి రెస్పాన్స్ దక్కుతుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు