సమంతను లక్కీ లేడీ అంటున్న యంగ్ హీరో

Published on Jul 19, 2019 12:31 am IST

వరుస విజయాలతో దూసుకుపోతున్న స్టార్ హీరోయిన్ సమంత క్రేజ్ ఈమధ్య డబుల్ అయింది. అందుకే ఆమె ద్వారా తమ సినిమాను ప్రమోట్ చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు చాలామంది నటీనటులు. వారిలో యంగ్ హీరో అడివి శేష్ కూడా ఉన్నారు. ఆయన నటించిన కొత్త చిత్రం ‘ఎవరు’ ట్రైలర్ రేపు సాయంత్రం 5: 30 గంటలకు సమంత చేతుల మీదుగా లాంచ్ కానుంది.

ఈ విషయాన్ని చెబుతూ సమంత.. గతంలో మీరు, మహేష్ బాబుగారు కలిసి నా ‘క్షణం’ సినిమా టీజర్ లాంచ్ చేశారు. అలాగే ‘గూఢచారి’ టీజర్ కూడా మీరే లాంచ్ చేశారు. ఆ రెండు సినిమాలు సక్సెస్ అయ్యాయి. మీరు లక్కీ లేడీ. రేపు నా ‘ఎవరు’ టీజర్ లాంచ్ చేస్తున్నందుకు కృతజ్ఞతలు అన్నారు. వెంకట్ రాంజీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను ఆగష్టు 15న రిలీజ్ చేయనున్నారు.

సంబంధిత సమాచారం :