ఊహించని పర్ఫెక్ట్ సీక్వెల్ తో వస్తున్న అడివి శేష్.!

Published on Mar 20, 2021 10:00 am IST

మంచి ఇంట్రస్టింగ్ అండ్ థ్రిల్లర్ చిత్రాలకు కేరాఫ్ అడ్రెస్ గా నిలిచిన టాలెంట్ యువ హీరో అడివి శేష్ ఇప్పుడు “మేజర్” మరియు తన స్పై థ్రిల్లర్ “గూఢచారి” సీక్వెల్ తో రెడీగా ఉన్న సంగతి తెలిసిందే. మరి ఈ రెండు ఆసక్తికర సినిమాల లైన్ లో ఉండగానే తన నెక్స్ట్ ప్రాజెక్ట్ పై ఈరోజు అనౌన్స్మెంట్ ఉందని తెలిపాడు. మరి ఆ అప్డేట్ ప్రకారం ఓ ఊహించని సినిమానే ప్రకటించాడు. గత ఏడాది ఈ మార్చ్ లోనే వచ్చిన క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థిల్లర్ “హిట్” కు సీక్వెల్ “హిట్ 2” లో హీరోగా శేష్ ఇప్పుడు కన్ఫర్మ్ అయ్యాడు.

నాచురల్ స్టార్ నాని ప్రొడక్షన్ లో శైలేష్ కొలను దర్శకత్వంలో అప్పుడే విశ్వక్ సేన్ హీరోగా వచ్చిన ఆ చిత్రం మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. అలాగే దానికి సీక్వెల్ కూడా ఉందని చెప్పారు. అందులో భాగంగానే ఆ చిత్రం విడుదలై ఏడాది పూర్తయిన సందర్బంగా నాని ఈసారి ఏపీ ఆఫీసర్ ను చూపిస్తానని చెప్పాడు. మరి ఇప్పుడు ఆ పవర్ ఫుల్ ఆఫీసర్ గా అడివి శేష్ అని రివీల్ చేశారు. అంతే కాకుండా ఒక ఆసక్తికర పోస్టర్ ను కూడా డిజైన్ చేసి వదిలారు.

శేష్ తో పాటుగా నీడలా ఒక వైల్డ్ డాగ్ లాంటి దాన్ని హైలైట్ చేసి పెట్టారు. దీనితో మరింత ఆసక్తి ఇప్పుడు రేగింది. అయితే నాని సీక్వెల్ చేస్తున్నామని శేష్ కూడా తన నెక్స్ట్ ప్రాజెక్ట్ అనౌన్సమెంట్ కోసం చెప్పాడు కానీ ఈ సినిమానే ఈ హీరోతోనే అని ఊహించింది కాదు. మరి ఇదే ఇంత సర్ప్రైజింగ్ గా ఉంటే సినిమా ఎలా ఉంటుందో చూడాలి. మరి ఈ చిత్రం మేజర్ అయ్యాక స్టార్ట్ చెయ్యనున్నట్టుగా అడివి శేష్ తెలిపాడు.

సంబంధిత సమాచారం :