‘గూఢచారి’ కృష్ణ, తూర్పు గోదావరి 2 రోజుల కలెక్షన్స్

‘గూఢచారి’ కృష్ణ, తూర్పు గోదావరి 2 రోజుల కలెక్షన్స్

Published on Aug 5, 2018 1:42 PM IST

gooda ar

అడివి శేష్ , శోభిత దూళిపాళ్ల హీరోహీరోయిన్లుగా నూతన దర్శకుడు శశి కిరణ్ టిక్క దర్శకత్వంలో తెరకెక్కిన్న చిత్రం ‘గూఢచారి’. అభిషేక్ పిక్చర్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్స్ పై అభిషేక్ నామా, టీజీ విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్ కలిసి నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మంచి టాక్ తో ప్రస్తుతం విజయవంతంగా దూసుకెళ్తోంది.

కాగా ఈ చిత్రం శనివారం నాటికి కృష్ణ జిల్లాలో 8,84,869 రూపాయల షేర్ ను వసూలు చేయగా, మొత్తం 2 రోజులుగానూ రూ .16.32 లక్షలు వసూలు చేసింది. అలాగే తూర్పు గోదావరిలోను గూఢచారి శనివారంకి 5,30,081 రూపాయల షేర్ ను కలెక్ట్ చేయగా, ఆ ప్రాంతంలో ఈ చిత్రం మొత్తం 2 రోజులకు గానూ రూ. 10.98 లక్షలు షేర్ ని కలెక్ట్ చేసింది. ఈ చిత్రం ఆదివారం ఇంకా కలెక్షన్స్ పరంగా పుంజుకుంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు