బిగ్ అప్డేట్ పై హింట్ ఇచ్చిన అడివి శేష్.!

Published on Aug 3, 2021 2:23 pm IST

మన టాలీవుడ్ యంగ్ టాలెంటెడ్ హీరో కమ్ ఇంటెలిజెంట్ ఫిల్మ్ మేకర్స్ లో అడివి శేష్ కి ఒక ప్రత్యేక స్థానం ఉందని చెప్పాలి. తన మార్క్ స్టోరీ టెల్లింగ్ మరియు కథా ఎంపికలతో శేష్ ఎప్పటికప్పుడు టాలీవుడ్ ఆడియెన్స్ ని థ్రిల్ చేస్తూ వస్తూనే ఉన్నాడు. అయితే శేష్ ఇప్పటి వరకు చేసిన సినిమాల్లో మంచి ఆదరణ అందుకున్న చిత్రాల్లో “గూఢచారి” కూడా ఒకటి.

తక్కువ బడ్జెట్ తోనే హాలీవుడ్ లెవెల్ మార్క్ చిత్రాన్ని శేష్ చూపించాడు. దీనితో ఈ చిత్రం సీక్వెల్ పై అంచనాలు పెరిగాయి. మరి ఈ చిత్రాన్ని కూడా స్టార్ట్ చేసుకున్న శేష్ మొదటి పార్ట్ వచ్చి నేటితో మూడేళ్లు కంప్లీట్ కావడంతో ఆసక్తికర అప్డేట్ ను రివీల్ చేసాడు. ఇదే ఆగష్టు నెలలో ఈ చిత్రంపై ఒక స్పెషల్ అప్డేట్ ను ఇస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేసాడు.

ఈ ఆగష్టు నెల తనకి ఎంతో స్పెషల్ అని.. అలాగే ఒక పెద్ద అప్డేట్ కూడా తన మిషన్ పై రానున్నట్టుగా హింట్ ఇచ్చాడు. మరి ఆ అప్డేట్ ఏంటి అన్నది వేచి చూడాలి. మరి దీనితో పాటుగా అడివి శేష్ నటిస్తున్న మరో చిత్రం “మేజర్” కూడా త్వరలోనే రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :