లేటెస్ట్ : అడివి శేష్ ‘హిట్ – 2’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ డీటెయిల్స్

లేటెస్ట్ : అడివి శేష్ ‘హిట్ – 2’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ డీటెయిల్స్

Published on Nov 22, 2022 8:51 PM IST


అడివి శేష్ హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ థ్రిల్లింగ్ యాక్షన్ సస్పెన్స్ మూవీ హిట్ 2.ది సెకండ్ కేస్. ఇటీవల రిలీజ్ అయి సూపర్ హిట్ కొట్టిన హిట్ 1 మూవీకి సీక్వెల్ గా తెరకెక్కుతున్న హిట్ 2 లో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తుండగా వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై నాచురల్ స్టార్ నాని, ప్రశాంతి తిపిర్నేని ఎంతో భారీ స్థాయిలో నిర్మించారు. ఇప్పటికే ఈ మూవీ నుండి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ టీజర్, ఉరికే ఉరికే అనే పల్లవితో సాగే ఫస్ట్ సాంగ్ అందరి నుండి మంచి అంచనాలు అందుకుని మూవీ పై బాగా హైప్ క్రియేట్ చేసాయి.

పోసాని కృష్ణమురళి, రావు రమేష్, తనికెళ్ళ భరణి, కోమలి ప్రసాద్, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రలు చేస్తున్న ఈ మూవీ యొక్క థియేట్రికల్ ట్రైలర్ ని రేపు ఉదయం 11 గం. 07 నిమిషాలకు రిలీజ్ చేస్తున్నట్లు ఇప్పటికే యూనిట్ ప్రకటించింది. కాగా ట్రైలర్ ని గ్రాండ్ ఈవెంట్ ద్వారా లాంచ్ చేయనున్నారు. అయితే రేపు ఉదయం హైదరాబాద్ లోని పివిఆర్, ఆర్కే సినీ కాంప్లెక్స్ లో 10 గం. ల నుండి పలువురు యూనిట్ సభ్యుల సమక్షంలో హిట్ 2 ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరుగనుంది. ఇక ఈ మూవీని డిసెంబర్ 2న ప్రేక్షకుల ముందుకి తీసుకురానున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు