రేణు పుత్రుడు అకీరా అప్పుడేఆరున్నర అడుగులట.

Published on Aug 27, 2019 5:24 pm IST

తాజాగా ఎవరు చిత్రంతో మంచి హిట్ అందుకున్న హీరో అడివి శేషు నటి రేణుదేశాయ్ ఇంటికి వెళ్లి ఆమె పిల్లలతో సరదాగా గడిపారు. ఆ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి. అడివి శేషు వారితో గడిపిన ఆ క్షణాలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. అకీరాతో ఈ రోజు ఆహ్లదంగా గడిపాను . అకీరాకు ఎవరు చిత్రం చాలా బాగా నచ్చింది. లంచ్ సమయంలో అనేక విషయాలు చర్చించుకున్నాం. అకీరా వాయిస్ చాలా గంభీరంగా ఉంది. అకీరా పొడవు 6 అడుగుల 4 అంగుళాలు. మేమిద్దరం ఎడమచేతి వాటం కలిగిన వాళ్ళం. అంతే కాదు మా ఇద్దరిలో అనేక కామన్ విషయాలు ఉన్నాయి అని అకిరా గురించి శేష్ చెప్పుకొచ్చాడు.

ఐతే అప్పుడే అకీరా అంత ఎత్తు ఎదిగిపోయాడా అని అందరు ఆశ్చర్యపోతున్నారు. దీనికి కారణం అకీరా వయసు ఇంకా కేవలం 15ఏళ్ళు మాత్రమే. అకీరా 2004లో జన్మించాడు. దీనితో అకీరా మంచి హీరో మెటీరియల్ అనిపిస్తుంది. ఇంకా ఐదేళ్ల లోపే అకీరా హీరోగా తెరంగేట్రం చేసినా ఆశ్చర్యం లేదు. అకీరా జన్మించిన రెండేళ్ళకి 2006లో పవన్ రేణూ విడిపోయారు.

సంబంధిత సమాచారం :