ప్రపంచీకరణ నేపధ్యంలో ఎన్నో కొత్త పరిశ్రమలు, ఉద్యోగాలు పుట్టుకొచ్చాయి. ఎంతో మంది తమ సొంత ఊర్లు విడిచి వివిధ రాష్ట్రాలు, దేశాలకు వెళ్లి స్థిరపడ్డారు. దీని వల్ల నిజంగా మన దేశం అభివృద్ధి చెందిందా? మన కలాం గారి కల, మిషన్ 2020 నెరవేరిందా? ఇలాంటి ఆసక్తికర అంశాలతో తెరకెక్కుతున్న సినిమా ఏవమ్ జగత్. ఈ చిత్రాన్ని మార్స్ మూవీ ప్రొడక్షన్స్ పతాకం పై ముణిరత్నం నాయుడు ఎన్, రాజేశ్వరి ఎన్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి దినేష్ నర్రా దర్శకత్వం వహిస్తున్నారు.
కిరణ్ గేయ, ప్రకృతివనం ప్రసాద్, రిటైర్డ్ బ్రిగేడియర్ గణేషమ్, ఇనయ సుల్తానా తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఏవమ్ జగత్ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. త్వరలో సినిమాను విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. ఈ నేపథ్యంలో సినిమా ఫస్ట్ లుక్ ను చిత్ర యూనిట్ విడుదల చేయడం జరిగింది.
అయితే ఈ నేపథ్యం లో దర్శకుడు దినేష్ నర్రా మాట్లాడుతూ, వ్యవసాయం భవిష్యత్తు ఏంటి? రాబోయే తరానికి కావలసిన ఆహార అవసరాలు తీర్చేటంత సాగు భూమి కానీ, పండించగల అనుభవం కానీ మన దేశ యువతకి ఉందా? అనే అంశాలను ప్రధానంగా ఏవం జగత్ చూపిస్తున్నామని అన్నారు. వ్యవసాయం మరియు మానవ సంబంధాలతో ముడిపడి ఉన్న అనేక ప్రశ్నలకు సమాధానం వెతికే ఒక 20 ఏళ్ల యువకుడి కథే ఏవం జగత్. ఒక పల్లెటూరిలో సాగే ఈ కథలో, దేశ పరిస్థితులను, పురోగతికి అద్దం పట్టేలా కథా కథనాలు సాగుతాయి, ఎన్ని కష్టాలు ఎదురైనా అనుకున్నది సాధించడంలో హీరో కమల్ ఎలాంటి ప్రయత్నం చేశాడు అనేది ఆసక్తికరంగా ఉంటుంది. చివరికి తెలుసుకున్నది ఏంటి అనేది తప్పక చూడాలి అని అన్నారు. ఏవం జగత్ సినిమా చిత్రీకరణ పూర్తి అయ్యిందని, ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయని, త్వరలోనే మూవీని మీ ముందుకు తీసుకొస్తామని అన్నారు. ఈ చిత్రానికి సంగీతం శివ కుమార్ అందిస్తున్నారు.


