నాలుగేళ్ల తర్వాత సెట్స్ మీదికి శ్రీకాంత్ అడ్డాల

Published on Jan 22, 2020 11:00 pm IST

శ్రీకాంత్ అడ్డాల.. చేసినవి తక్కువ సినిమాలే అయినా తనకంటూ ఒక ప్రత్యేకమైన, సున్నిత విధానం ఉందనే గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు. ‘కొత్త బంగారులోకం’తో యువతను మెస్మరైజ్ చేసి రెండవ సినిమానే మహేష్ బాబు, వెంకటేష్ లాంటి స్టార్ హీరోలతో ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ మల్టీస్టారర్ సినిమా చేసి స్టార్ డైరెక్టర్ అయిపోయారు. ఈ రెండు విజయాలతో ఇకపై ఆయనకు తిరిగులేదని అనుకున్నారంతా.

కానీ 2016లో వచ్చిన ‘బ్రహ్మోత్సవం’ ఫ్లాప్ కావడంతో ఆయనకు బ్రేకులు పడ్డాయి. అప్పటి నుండి ఇప్పటి వరకు ఆయన్నుండి ఇంకో సినిమా రాలేదు. మధ్యలో పలు ప్రాజెక్ట్స్ స్టార్ట్ అవుతాయనే వార్తలు వచ్చినా ఏవీ పట్టాలెక్కలేదు. సుధీర్ఘమైన నాలుగేళ్ల తర్వాత ఎట్టకేలకు విక్టరీ వెంకటేష్ హీరోగా ‘నారప్ప’ సినిమా కుదిరింది. ఇది తమిళ చిత్రం ‘అసురన్’కు రీమేక్. ఈరోజే అనంతపురంలో షూట్ మొదలైంది. ఇన్నాళ్లకు శ్రీకాంత్ అడ్డాల సెట్స్ మీద యాక్షన్, కట్ చెపుతున్నారు. ఇకరకంగా ఇది ఆయనకు రీఎంట్రీ అనే అనాలి. ఈ సినిమా విజయవంతమై శ్రీకాంత్ అడ్డాలకు పూర్వ వైభవాన్ని తీసుకురావాలని కోరుకుందాం.

సంబంధిత సమాచారం :

X
More