“రాక్షసుడు” బెల్లంకొండ దాహం తీర్చినట్టేనా…!

Published on Aug 3, 2019 9:27 pm IST

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన “రాక్షసుడు” నిన్న విడుదలై హిట్ టాక్ సొంతం చేసుకుంది. మొదటి షో నుండే రాక్షసుడు చిత్రానికి ప్రేక్షకులు అనుకూలంగా తీర్పు ఇవ్వడం జరిగింది. ఉత్కంఠంగా సాగే ఈ క్రైమ్ థ్రిల్లర్ అందరిని బాగానే ఆకట్టుకుంది. కాగా బెల్లంకొండ శ్రీనివాస్ ఐదేళ్ల నిరీక్షణకు ఫలితం “రాక్షసుడు” చిత్రంతో దక్కినట్లే అని కొందరు అంటున్నారు.

బడా నిర్మాత బెల్లంకొండ సురేష్ కొడుకుగా శ్రీనివాస్ అరంగేట్రమే అదిరిపోయే రేంజ్ లో ఇచ్చారు. టాలీవుడ్ లో స్టార్ హీరో వారసులు కూడా ఆ రేంజ్ లో చిత్ర పరిశ్రమకు పరిచయం కాలేదంటే అతిశయోక్తికాదు. స్టార్ డైరెక్టర్ వి వి వినాయక్ దర్శకత్వంలో ,స్టార్ హీరోయిన్ సమంత జోడీగా, తమన్నా స్పెషల్ సాంగ్ తో దాదాపు 35కోట్ల బడ్జెట్ తో “అల్లుడు శీను” చిత్రం తెరకెక్కడం జరిగింది. ఒక కొత్త హీరో చిత్రానికి ఇంత బడ్జెట్ పెట్టి సినిమా తీయడం, సాహసమే అని చెప్పాలి. ఐతే ఆ చిత్రం విజయం సాధించడంతో పెట్టుబడికి ఫలితం దక్కింది.

ఆ చిత్రం తరువాత బెల్లంకొండ కన్నడ చిత్రాన్ని “స్పీడున్నోడు” గా తెలుగులో రీమేక్ చేశారు, భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం పరాజయం పాలైంది. బోయపాటి దర్శకత్వంలో వచ్చిన “జయ జానకి నాయక” చిత్రం పర్వాలేదనిపించిగా, కవచం,సాక్ష్యం,సీత చిత్రాలు నిరాశ పరిచాయి. కాగా 2014లో విడుదలైన “అల్లుడు శీను” చిత్రం తరువాత “రాక్షసుడు” చిత్రం తో బెల్లంకొండ విజయం అందుకున్నారు.

సంబంధిత సమాచారం :