“నారప్ప” ట్రైలర్..చాన్నాళ్ళకి వెంకీ మామ మాస్ విశ్వరూపం.!

Published on Jul 14, 2021 12:25 pm IST

మన టాలీవుడ్ అగ్ర కథానాయకులలో ఒకరైన విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రాల్లో ఇంటెన్స్ క్రైమ్ ఎమోషనల్ డ్రామా “నారప్ప” కూడా ఒకటి. తమిళ సూపర్ హిట్ చిత్రం “అసురన్” కి రీమేక్ గా ఫ్యామిలీ ఎంటర్టైనింగ్ చిత్రాల దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించారు. మరి చాలా కాలం చర్చల అనంతరం ఈ చిత్రం నేరుగా ఓటిటి రిలీజ్ కే ఫైనల్ అయ్యింది. మరి అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలకు సిద్ధం అవుతున్న ఈ చిత్రం నుంచి మేకర్స్ ఇప్పుడు ట్రైలర్ ను విడుదల చేశారు.

ఇది మాత్రం దగ్గుబాటి అభిమానులు సహా వెంకీ మామ నటన అంటే ఇష్టపడే ప్రతీ ఒక్కరికీ చాలా కాలం అనంతరం ఫుల్ మీల్స్ పెట్టే సినిమాలా ఉండబోతుందని అర్ధం అవుతుంది. ఒరిజినల్ వెర్షన్ కి ఎక్కడా తగ్గకుండా శ్రీకాంత్ అడ్డాల టేకింగ్ కానీ చూపిన విజువల్స్ కానీ చాలా ఆసక్తికరంగా అనిపిస్తుంది. అలాగే వెంకటేష్ నుంచి సరైన మాస్ కోణాన్ని చూసి చాలా కాలం అయ్యిన వారికి “నారప్ప” మళ్ళీ “లక్ష్మి”, “తులసి” పాత రోజులు గుర్తు చేయడం ఖాయం అని చెప్పాలి.

రెండు షేడ్స్ లో కూడా వెంకటేష్ ఇంటెన్స్ పెర్ఫామెన్స్ కనబరిచారు. ఇంకా మణిశర్మ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ సామ్ కే నాయుడు కెమెరా వర్క్ కానీ ఈ ట్రైలర్ కి మరో అదనపు హంగుని తీసుకొచ్చాయి. ఇంకా శ్రీకాంత్ అడ్డాల టేకింగ్ పై చాలా మంది డౌట్స్ పెట్టుకున్న వారు ఉన్నారు ఇలాంటి ఇంటెన్స్ మాస్ డ్రామాని ఎలా డీల్ చేస్తారు అని దానికి ఈ ట్రైలర్ పర్ఫెక్ట్ ఆన్సర్ అని చెప్పొచ్చు. ఇక ఈ చిత్రం వచ్చే జూలై 20 ప్రైమ్ వీడియోలో చూసి ఎంజాయ్ చెయ్యడమే తరువాయి అనేది ఫైనల్ మాట.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం :