మహేష్ మూవీ తరువాత మళ్ళీ త్రివిక్రమ్ ఆ హీరో తోనే ?

trivikram
సూపర్ స్టార్ మహేష్ తో ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒక భారీ ఫామిలీ యాక్షన్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ మూవీ నెక్స్ట్ షెడ్యూల్ అతి త్వరలో ప్రారంభం కానుంది. హారికా హాసిని క్రియేషన్స్ వారు ఎంతో భారీ వ్యయంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ మూవీలో మహేష్ బాబు మంచి మాస్ టచ్ తో కూడిన ఎంటర్టైనింగ్ రోల్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ మూవీ పై సూపర్ స్టార్ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ అందరిలో కూడా మంచి అంచనాలు ఉన్నాయి. దీనిని ఆగష్టు లో రిలీజ్ చేయనున్నారు మేకర్స్.

అయితే విషయం ఏమిటంటే, దీని తరువాత మరొక్కసారి అల్లు అర్జున్ తో వర్క్ చేయనున్నారట త్రివిక్రమ్. ఇక ఇటీవల నాగవంశీ ఒక మీడియా ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ, ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ ఒక భారీ పౌరాణిక మూవీ చేసే ఆలోచనలో ఉన్నట్లు చెప్పారు. అయితే ప్రస్తుతం కొరటాల శివతో తన లేటెస్ట్ మూవీ చేస్తున్న ఎన్టీఆర్, దాని అనంతరం ప్రశాంత్ నీల్ తో వర్క్ చేస్తారని, ఇవి రెండూ పూర్తి అయిన తరువాతనే హారికా హాసిని బ్యానర్ లో ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబో మూవీ ఉంటుందని తెలుస్తోంది. ఇక మహేష్ మూవీ తరువాత అల్లు అర్జున్ తో త్రివిక్రమ్ చేయబోయే మూవీ భారీ పాన్ ఇండియన్ రేంజ్ లో ఉంటుందనే బజ్ కూడా నడుస్తోంది. కాగా దీనిపై డిటైల్డ్ గా న్యూస్ మాత్రం రావాల్సి ఉంది.

Exit mobile version