
‘బాహుబలి-ది కంక్లూజన్’ చిత్రం ఏపి, తెలంగాణల్లో ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో ఇతర రాష్ట్రాల్లో కూడా అదే స్థాయి విజయాన్ని అందుకోంది. ముఖ్యంగా తమిళనాడులో ఈ సినిమా తమిళ స్టార్ హీరోల రికార్డుల్ని బద్దలుకొట్టి సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. మొదటి 13 రోజులకుగాను రూ. 90 కోట్ల గ్రాస్ వసూలు చేసిన ఈ సినిమా నిన్నటితో రూ. 100 కోట్ల మైలు రాయిని అందుకుంది.
ఒక తెలుగు సినిమా తమిళనాట 100 కోట్ల కలెక్షన్ సంఖ్యను నమోదు చేయడం ఇదే మొదటి సారి. అంతేగాక తమిళనాడులో సైతం సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ‘రోబో’ తర్వాత మొదటి 16 రోజుల్లో రూ. 100 కోట్లు టచ్ చేసిన రెండవ సినిమా ఇదే కావడం విశేషం. దీంతో కోలీవుడ్లో ప్రభాస్ పేరిట సరికొత్త రికార్డ్ నమోదైంది.