“RRR” కి మరో అదిరే ప్లాన్ లో ఉన్న రాజమౌళి.!

“RRR” కి మరో అదిరే ప్లాన్ లో ఉన్న రాజమౌళి.!

Published on Jul 17, 2021 3:59 PM IST

దర్శక దిగ్గజం రాజమౌళి ఇప్పుడు ఏ సినిమా చెప్పటినా అది పాన్ ఇండియా ప్రాజెక్ట్ అయ్యి తీరాల్సిందే. మరి అలా బాహుబలి తర్వాత ఎవరూ ఊహించని కాంబోని సెట్ చేసి సినిమా కోసం నేరుగానే చెప్పేసారు. తారక్ మరియు చరణ్ లాంటి ఇద్దరు సంచలనాత్మక మాస్ హీరోస్ తో రియల్ లైఫ్ హీరోల పాత్రల ఆధారంగా తెరకెక్కిస్తున్న ఆ చిత్రమే “రౌద్రం రణం రుధిరం”.

భారీ అంచనాలు నెలకొల్పుకున్నా ఈ బిగ్గెస్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ఇప్పుడు ప్రమోషన్స్ పై దృష్టి సారించింది. ఓ పక్క సినిమాకి ఫైనల్ టచ్ షూటింగ్ అండ్ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న జక్కన్న ప్రమోషన్స్ కి కూడా సెపరేట్ టీమ్ ని పెట్టేసుకున్నారు.

మరి వారి నుంచే ఇటీవల వచ్చిన మేకింగ్ వీడియోకి దద్దరిల్లే రెస్పాన్స్ వచ్చింది. ఇక దాని తర్వాత మరో అదిరే ప్లాన్ ని రాజమౌళి వేసినట్టు తెలుస్తుంది. ఈసారి ఒక ప్రమోషనల్ వీడియో సాంగ్ ని ఈ చిత్రం కోసం డిజైన్ చేస్తున్నారట. దాని కోసమే భారీ సెట్టింగ్స్ కూడా చెక్కుతున్నారు. మరి ఈ వీడియో ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు