“RRR” తర్వాత బాక్సాఫీస్ దగ్గర చరణ్ డామినేషన్ ఇంకో లెవెల్లో.?

“RRR” తర్వాత బాక్సాఫీస్ దగ్గర చరణ్ డామినేషన్ ఇంకో లెవెల్లో.?

Published on Aug 4, 2021 11:03 AM IST


ప్రస్తుతం ఇండియన్ సినిమా దగ్గర భారీ హైప్ తో ఎదురు చూస్తున్న అతి కొద్ది చిత్రాల్లో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లతో దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న బిగ్గెస్ట్ ఇండియన్ యాక్షన్ థ్రిల్లర్ మల్టీస్టారర్ “రౌద్రం రణం రుధిరం” కూడా ఒకటి. మరి అంతకంతకూ ఎనలేని అంచనాలు పెంచుకుంటూ వెళ్తున్న ఈ చిత్రం నుంచి రీసెంట్ గా ఫస్ట్ సింగిల్ “దోస్తీ” వచ్చిన సంగతి తెలిసిందే.

మరి దీని తర్వాత చరణ్ స్క్రీన్ ప్రెజెన్స్ కి వచ్చిన రెస్పాన్స్ అయితే మరో లెవెల్.. ఒక్క మన దగ్గరే కాకుండా బాలీవుడ్ వర్గాలను సైతం చరణ్ స్క్రీన్ ప్రెజెన్స్ కట్టిపడేయడం మరింత హాట్ టాపిక్ అవుతుంది. పాట వచ్చి ఇన్ని రోజులు అయినా కూడా టాలీవుడ్ ఆడియెన్స్ సహా బాలీవుడ్ ఫిల్మ్ అనలిస్టులు కూడా ఇంకా తమ రెస్పాన్స్ ని చెప్పకుండా ఉండలేకపోతున్నారు. ఆ రేంజ్ లో చరణ్ డామినేషన్ క్లియర్ గా కనిపించింది.

అయితే తన వరకు మాత్రం ఇప్పుడు అదిరే ఫీడ్ బ్యాక్ ను అందుకున్న చరణ్ ఆఫ్టర్ “RRR” వేరే లెవెల్ మాస్ చూపించడం కన్ఫర్మ్ అని చెప్పాలి. ఇదే సాలిడ్ కటౌట్ మంచి లుక్ తో కంటిన్యూ అయితే బాలీవుడ్ ని మరింత ఆశ్చర్యపరచడం ఖాయం. మన ఇండియన్ సినిమా దగ్గర అతి పెద్ద బాక్సాఫీస్ మార్కెట్ బాలీవుడ్ కి కూడా ఉంది. చరణ్ గ్రేస్ కనుక ఇలాగే కొనసాగితే డెఫినెట్ గా మన టాలీవుడ్ నుంచి పాన్ ఇండియన్ స్టార్ గా అది కూడా బాక్సాఫీస్ పరంగా నిలకడ కలిగే స్టార్డం ను తెచ్చుకోవచ్చు.. మరి శంకర్ తో సినిమాకు ఎలాంటి ప్లానింగ్ లు ఉన్నాయో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు