ప్రభాస్ ప్లాన్ మిస్సవ్వలేదట..చిన్న చేంజ్ అంతే!

Published on Dec 4, 2020 10:00 am IST

ఇప్పుడు ఇండియన్ సినిమా అంతా వ్యాప్తి చెందిన పేరు ప్రభాస్. వరుస పాన్ ఇండియన్ చిత్రాలతో టాక్ ఆఫ్ ది టౌన్ కాదు టాక్ ఆఫ్ ది నేషన్ గా డార్లింగ్ నిలిచాడు. అయితే పాన్ ఇండియన్ స్టార్ గా వరుస సినిమాలను ఓకే చేస్తుండడంతో అంతకంతకు అంచనాలను ప్రభాస్ పీక్స్ కు తీసుకెళ్ళిపోతున్నాడు. అలా లేటెస్ట్ గా అనౌన్స్ చేసిన “సలార్” నే ఉదాహరణగా తీసుకోవచ్చు.

ఇదిలా ఉంటే ఆల్రెడీ ఎప్పుడో ఓకే చేసేసిన సినిమాలను దాటి ఈ సినిమాకు ఏకంగా ఫస్ట్ లుక్ పోస్టరే వచ్చేయడంతో ఇది మరింత హాట్ టాపిక్ అయ్యింది. అయితే అసలు ప్రభాస్ ప్లాన్ మారిందా అన్న దానిపై ఇప్పుడు క్లారిటీ వస్తుంది. నిజానికి ప్రభాస్ మరియు ప్రశాంత్ నీల్ ల మధ్య సినిమా ఉందని ఎప్పటి నుంచో వినిపిస్తున్న మాటే. కానీ ఈ లెవెల్లో అన్ని యాంగిల్స్ ను మారుస్తూ ప్రకటన వస్తుంది అని ప్రభాస్ ఫ్యాన్స్ కూడా ఊహించి ఉండరు.

అయితే దీనికి ముందు నిజానికి ప్రభాస్ జనవరి నుంచి “ఆదిపురుష్” షూట్ జనవరి నుంచి మొదలు కావాల్సి ఉంది. అలాగే ఒకప్పుడు ఈ చిత్రాన్ని అలాగే నాగశ్విన్ తో సినిమాను కూడా ఏక కాలంలో పూర్తి చేస్తాడని ఇన్ఫార్మ్ చేసాము. కానీ సడెన్ గా నీల్ ప్రాజెక్ట్ రావడంతో “సలార్”, “ఆదిపురుష్” సినిమాల షూట్ ఒకసారి జరుగుతాయా అని డౌట్ వచ్చింది.

దీనితో ప్రభాస్ పర్ఫెక్ట్ ప్లానింగ్ కూడా మారిందా అన్న అనుమానాలు మొదలయ్యాయి. కానీ అసలు విషయానికి వెళితే ప్రభాస్ ప్లాన్ లో ఎలాంటి మార్పు లేదు అని తెలుస్తుంది. ఏక కాలంలో “ఆదిపురుష్”, అలాగే నాగశ్విన్ తో సినిమాలు తెరకెక్కుతాయట. అది కూడా వచ్చే ఏడాది లోనే కానీ వాటి కన్నా ముందు ప్రశాంత్ నీల్ తో సినిమా కంప్లీట్ చెయ్యాలని ప్రభాస్ తన ప్లానింగ్ లో చిన్న చేంజ్ చేసాడు అంతే.

సంబంధిత సమాచారం :

More