అఖిల్ “ఏజెంట్” డిజిటల్ రైట్స్ సొంతం చేసుకున్న ప్రముఖ ఓటిటి సంస్థ!

అఖిల్ “ఏజెంట్” డిజిటల్ రైట్స్ సొంతం చేసుకున్న ప్రముఖ ఓటిటి సంస్థ!

Published on Feb 21, 2023 3:40 PM IST

టాలీవుడ్ యంగ్ హీరో అండ్ టాలెంటెడ్ హీరో అక్కినేని అఖిల్ హీరోగా స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పై యాక్షన్ థ్రిల్లర్ ఏజెంట్. ఈ చిత్రం లో అఖిల్ మునుపెన్నడూ లేని విధంగా సూపర్ స్టైలిష్ గా కనిపిస్తున్నారు. ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలకి ఇప్పటికే ప్రేక్షకుల నుండి అభిమానుల నుండి సూపర్ రెస్పాన్స్ వస్తోంది.

తాజాగా ఈ చిత్రం కి సంబంధించిన డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటిటి సంస్థ సోనీ లివ్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది. ఈ చిత్రం లో అఖిల్ అక్కినేని సరసన సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తుండగా, హిప్ హాప్ తమిజా సంగీతం అందిస్తున్నారు. పాన్ ఇండియా మూవీ గా రిలీజ్ కానున్న ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు