రెండు భాగాలుగా యష్ “టాక్సిక్”?

రెండు భాగాలుగా యష్ “టాక్సిక్”?

Published on May 4, 2024 1:32 AM IST

డిసెంబర్ 2023 ప్రారంభంలో కన్నడ స్టార్ హీరో యష్ 19వ చిత్రం టాక్సిక్ ను అనౌన్స్ చేయడం జరిగింది. ఈ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామాకి డైరెక్టర్ గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం నుండి ఒక ఇంట్రెస్టింగ్ ఇన్ఫో బయటికి వచ్చింది. ఈ సినిమాను కేజీఎఫ్ సిరీస్ చిత్రాల మాదిరిగా రెండు భాగాలుగా రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. దీనిపై త్వరలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

ఇక ఈ చిత్రంలో హీరో కి సోదరి పాత్రలో స్టార్ నటిని తీసుకోవాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. హీరోయిన్ పాత్ర కోసం కూడా వివిధ నటీమణుల పేర్లు ఆన్‌లైన్‌లో హల్‌చల్ చేస్తున్నప్పటికీ మేకర్స్ నుండి అధికారిక ధృవీకరణ రాలేదు. KVN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కె నారాయణ నిర్మిస్తున్న ఈ టాక్సిక్ మూవీ ఏప్రిల్ 10, 2025న థియేటర్ల లో రిలీజ్ కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు