ప్రారంభమైన మరో కొత్తరకం సినిమా !

ప్రారంభమైన మరో కొత్తరకం సినిమా !

Published on Jul 15, 2018 11:06 PM IST

నిర్మాత రాహుల్ యాదవ్ నక్కా స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై “మళ్ళీరావా” సినిమా తరువాత, ఆయన నిర్మిస్తున్న రెండో చిత్రానికి “ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ” అనే టైటిల్ ను ఖరారు చేశారు. సినీవర్గాల సమాచారం ఓ కొత్త రకం సబ్జెక్టుతో ఈ చిత్రం థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందించబడుతుంది. కాగా ఈ సినిమా ఆదివారం పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది. మళ్ళీరావా దర్శకులు గౌతమ్ తిన్ననూరి తొలి షాట్ కు క్లాప్ కొట్టారు. ఈ సందర్భంగా టైటిల్ పోస్టర్ విడుదల చేసింది చిత్రబృందం. ఈ సినిమాలో నవీన్ పొలిశెట్టి, శృతి శర్మ హీరో హీరోయిన్లుగా నటించనున్నారు.

కాగా స్వరూప్ ఆర్.ఎస్.జే ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. త్వరలో ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ చిత్రం తనకు మంచి గుర్తింపును తెచ్చిపెడుతోందని నిర్మాత రాహుల్ దేవ్ నక్కా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. సన్నీ కురపాటి సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ సినిమాకు మార్క్ క్రోబిన్ స్వరాలు సమకూరుస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు