అజ్ఞాతవాసి సెన్సార్ డేట్ మారింది !

పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కలయికలో వస్తోన్న మూడో సినిమా అజ్ఞాతవాసి. ఈ సినిమా టిజర్ పాటలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. పవన్ కళ్యాణ్ నటించిన 25వ సినిమా అవ్వడంతో ఈ ప్రాజెక్ట్ పై హైప్ పెరిగింది. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10 న విడుదల కాబోతున్న ఈ సినిమాను హారికా హాసిని సంస్థ నిర్మిస్తోంది.

షెడ్యూల్ ప్రకారం ఈ నెల 29 న ఈ సినిమా సెన్సార్ జరగాలి. కాని కొన్ని అనివార్య కారణాలవల్ల ఈ సినిమా సెన్సార్ ఒకరోజు వాయిదా పడింది. 30 న సెన్సార్ పూర్తి చేసుకోనున్న ఈ సినిమాలో బోమైన్ ఇరాని, ఇంద్రజ, కుష్బు, రఘుబాబు, తనికెళ్ళ భరణి తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపిస్తున్నారు.