‘అజ్ఞాతవాసి’ కృష్ణా జిల్లా కలెక్షన్లు !
Published on Jan 12, 2018 3:40 pm IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 25వ చిత్రం ‘అజ్ఞాతవాసి’ ఎన్ని భారీ అంచనాలతో విడుదలైందో తెలిసిన సంగతే. కానీ చిత్రం మాత్రం ఆ అంచనాలను అందుకునే స్థాయిలో లేకపోవడం వలన మొదటిరోజే మిక్స్డ్ టాక్ బయలుదేరింది. దీంతో రెండవ రోజు వసూళ్ళలో భారీ తగ్గుదల కనిపించింది.

సుమారు రూ.8 కోట్లకు హక్కులు అమ్ముడైన కృష్ణా జిల్లలో మొదటి రోజు రూ.2.15 కోట్లు వసూలు కాగా రెండవ రోజు మాత్రం కేవలం రూ.22.66 లక్షలు మాత్రమే వసూలయ్యాయి. దీంతో అమ్ముడైన మొత్తం వెనక్కి వస్తుందా రాదా అనేది సందిగ్ధంగా మారింది. ఇకపోతే ముందు నుండి ఉన్న భారీ క్రేజ్ మూలాన మొదటిరోజు తెలుగు రాష్ట్రాల్లో రూ.26.99 కోట్లు రాబట్టి నాన్ ‘బాహుబలి -2’ రికార్డుల్ని క్రియేట్ చేసిందీ చిత్రం.

 
Like us on Facebook