బాలీవుడ్ సీనియర్ హీరోయిన్, పంజాబ్ కింగ్స్ జట్టు ఓనర్ ప్రీతి జింటా తాజాగా ట్విట్టర్ వేదికగా అభిమానులతో చాట్ చేశారు. ఈ క్రమంలో ఓ నెటిజన్ ఓ ప్రశ్న అడిగారు. ‘మీరు తెలుగు సినిమాల్లో మళ్లీ నటిస్తారా ? అంటూ ఆ అభిమాని ప్రశ్నించాడు. ఈ ప్రశ్నకు ప్రీతి జింటా సమాధానమిస్తూ.. ‘కచ్చితంగా చేస్తాను. అసలు నేను తెలుగు సినిమాలు ఎప్పుడూ చేయను అని చెప్పను. ఒకవేళ తెలుగులో నాకు మంచి కథ దొరికితే కచ్చితంగా చేస్తానేమో ఎవరికి తెలుసు’ అంటూ ప్రీతి జింటా బదులిచ్చారు.
ప్రీతి జింటా గతంలో వెంకటేశ్ తో ‘ప్రేమంటే ఇదేరా’, మహేశ్ బాబుతో ‘రాజకుమారుడు’ వంటి సినిమాల్లో ఆమె నటించారు. తెలుగు ప్రేక్షకులకు ప్రీతి జింటా బాగా పరిచయం. ప్రీతి జింటా హిందీ సినిమాలతో పాటు తెలుగు, పంజాబీ, ఇంగ్లీష్ సినిమాల్లో కూడా నటించింది. మరి ప్రీతి జింటా తెలుగులో మళ్లీ నటిస్తోందో లేదో చూడాలి.