డైరెక్ట్ ఓటిటి రిలీజ్ కానున్న “విద్య వాసుల అహం”

డైరెక్ట్ ఓటిటి రిలీజ్ కానున్న “విద్య వాసుల అహం”

Published on May 6, 2024 10:00 PM IST

రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ ప్రధాన పాత్రల్లో, డైరెక్టర్ మణికాంత్ గెల్లి దర్శకత్వం లో తెరకెక్కుతున్న చిత్రం విద్య వాసుల అహం. తన్విక జస్విక క్రియేషన్స్ సమర్పణలో, ఎటర్నిటీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నవ్య మహేష్, రంజిత్ కుమార్ కొడాలి, చందన కట్ట లు సంయుక్తం గా నిర్మిస్తున్న ఈ చిత్రానికి కళ్యాణి మాలిక్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం రిలీజ్ పై మేకర్స్ సరికొత్త ప్రకటన చేయడం జరిగింది.

ఈ చిత్రం ను థియేట్రికల్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేసారు. తాజాగా ఈ చిత్రం ను డైరెక్ట్ డిజిటల్ గా రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫామ్ అయిన ఆహా వీడియో ద్వారా ఈ చిత్రం డైరెక్టర్ డిజిటల్ ప్రీమియర్ గా ఆడియెన్స్ ముందుకి రానుంది. త్వరలో ఈ చిత్రం కి సంబందించిన రిలీజ్ డేట్ ను ప్రకటించనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు