యూనివర్సల్ స్టార్ హీరో కమల్ హాసన్ ప్రధాన పాత్రలో, స్టార్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ థగ్ లైఫ్. స్టార్ హీరోయిన్ త్రిష ఫీమేల్ లీడ్ రోల్ లో నటిస్తున్న ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డు విన్నర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం మరోసారి వార్తల్లో నిలిచింది. మే 8, 2024 న మరొక కీలక పాత్రను ఇంట్రడ్యూస్ చేయనున్నట్లు తెలుస్తోంది.
ఇదే విషయాన్ని వెల్లడించడానికి సరికొత్త పోస్టర్ ను విడుదల చేసారు. పోస్టర్ ఆడియెన్స్ ను విశేషం గా ఆకట్టుకుంటుంది. అయితే ఈ కీలక పాత్ర శింబు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. క్లారిటీ రావాలంటే 8 వ తేది వరకు ఎదురు చూడాల్సిందే. థగ్ లైఫ్‌లో జయం రవి, దుల్కర్ సల్మాన్, ఐశ్వర్య లక్ష్మి, గౌతమ్ కార్తీక్, నాజర్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. కమల్ హాసన్, మణిరత్నం, ఆర్. మహేంద్రన్, శివ అనంత్ లు నిర్మిస్తున్న ఈ చిత్రం పై అందరిలో ఆసక్తి నెలకొంది.